*Wife gets insecure with Anushka*See where she has her hands*Kaleja’s sexy and secretive item girl*Shriya’s September fixation*Who is the richest heroine? *శ్రీరామరాజ్యం 50 రోజుల వేడుక*శ్రీయ చేజిక్కిన త్రిష సినిమా*Why Obama in Tirupati?*Gummadkaya Donga*Rahman and Ash’s relationship
Filmifunda » Movie news » శ్రీయ చేజిక్కిన త్రిష సినిమా
telugu movie news
శ్రీయ చేజిక్కిన త్రిష సినిమా
Thursday, November 24, 2011, 00:00 [IST]
Sriya Sharan
SocialTwist Tell-a-Friend

ఓ కథానాయిక కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వలేనంత బిజీ బిజీగా ఉంటే.. అది మరో నాయికకు ప్లస్ అవుతుంది. ప్రస్తుతం శ్రీయకు అలానే జరిగింది. మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా ‘హీరో’ అనే చిత్రం రూపొందనుంది.చిత్రంలో త్రిషను నాయికగా అనుకున్నారు. కానీ త్రిష డేట్స్ కేటాయించలేని పరిస్థితిలో ఉండటంతో ఈ అవకాశం శ్రీయకు దక్కింది. త్రిష, శ్రీయ ఇద్దరూ మంచి స్నేహితులు. అందుకని తను వదులుకున్న సినిమా శ్రీయకు దక్కడంపట్ల త్రిష ఆనందపడుతున్నారట.
అలాగే త్రిష కాదనుకున్న సినిమాలో తను నటించడం శ్రీయకు కూడా ఆనందాన్నిచ్చిందట. దీపన్ దర్శకత్వంలోచిత్రం రూపొందనుంది. ఇటీవలచిత్రకథను ఆయన శ్రీయకు వివరించారట. కథ వినిబ్యూటీ ఎక్సైట్ అయ్యి, వెంటనే డేట్స్ ఇచ్చేశారట. మలయాళంలో శ్రీయకి ఇది మూడో సినిమా. ‘పోకిరి రాజా’ చిత్రం ద్వారా కేరళీయులకు పరిచయం అయ్యారామె.
ఆ చిత్రం శ్రీయకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మలయాళంలో ఆమె నటించిన రెండో సినిమా ‘కాసనోవా’ త్వరలో విడుదల కానుంది. ఇక తాజాగా కమిట్ అయినమూడవ సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ప్రస్తుతం శ్రీయ తెలుగులో ఓ సినిమా, హిందీలో ‘గల్లీ గల్లీ మే చోర్ హై’ చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘రాజబాట్టయ్’లో ఆయన సరసన శ్రీయ ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు.

Related Articles
 

Todays Popular

Sexy Siren Decides To Go Semi Nude
Pic Of the Day : Sexy Siren Decides To Go Semi Nude