| |
|
|
|
|
|
|
| Filmifunda » Movie news »
శ్రీరామరాజ్యం 50 రోజుల వేడుక |
|
|
| శ్రీరామరాజ్యం 50 రోజుల వేడుక |
| Friday, January 06, 2012, 00:00 [IST] |
|
|
|
|
| |
‘‘ఈ ఏడాది 120 దాకా స్ట్రయిట్ సినిమాలు, 130 దాకా డబ్బింగ్ సినిమాలొచ్చాయి. కానీ అవి ఎలాంటి సినిమాలు? ఒక్కసారి మనం ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అనేది ప్రేక్షకులు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాలి. పక్క రాష్ట్రాల్లో యూత్ మంచి సినిమాలనే చూస్తున్నారు. ఇక్కడ యూత్‌కి బూతు కావాల్సి వస్తోంది. ‘శ్రీరామరాజ్యం’లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు బాధ్యతగా స్వీకరించి, ఆదరించాలి’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. నయనతారను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘ఇక నటించకూడదని నిర్ణయించుకున్నావని మీడియా ద్వారా తెలుసుకున్నాను.
కానీ నువ్వు చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. పెళ్లయిన తర్వాత కూడా సావిత్రి, జమున, జయసుధ...లాంటి నటీమణులు అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. వారిలాగే నువ్వు కూడా గొప్ప పాత్రలు చేయాలి. బాలకృష్ణ గొప్ప గొప్ప పాత్రలతో ఇంకా ముందుకెళుతున్నారు. ఆయనకు నీలాంటి నటి కావాలి’’ అని దాసరి పేర్కొన్నారు. ఆ వెంటనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందిస్తూ... ‘‘నయనతారకు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే. అమ్మా... నువ్విక నటించొద్దు. ఇంతకంటే గొప్ప కేరక్టర్ నువ్వు మళ్లీ చేయలేవు. బాపూగారిలాంటి దర్శకుడు నీకు మళ్లీ దొరకడు.
మళ్లీ సినిమాల్లో నటించి, నీ కీర్తిని తగ్గించుకోవద్దు’’ అన్నారు. నయనతార, బాలకృష్ణ సీతారాములుగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ అర్ధ శతదినోత్సవ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నయనతారను ఉద్దేశించి దాసరి, బాలు పై విధంగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘రామాయణం అంటే అదేమన్నా కొత్త రకం పరమాన్నమా? అనే విధంగా నేడు సొసైటీ తయారైంది. అలాంటి పరిస్థితుల్లో ‘శ్రీరామరాజ్యం’ వాళ్లకొక పాఠ్యాంశంగా నిలిచింది. పాత్రలపరంగా, రాజకీయపరంగా నాన్నగారు ఎన్నో సాహసాలు చేశారు.
ఆయన బిడ్డగా నేను కూడా చేయగలనన్న నమ్మకంతో, దృఢవిశ్వాసంతో ‘శ్రీరామరాజ్యం’ చేశాను. సంస్కృతికి మూలస్థంభమైన రామాయణ గాథకు తెర రూపాన్నిచ్చిన నిర్మాత యలమంచిలి సాయిబాబు మా అందరి కలల్నీ ధన్యం చేశారు. ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు కృతజ్ఞతలు’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సాయిబాబు ఈ సినిమాని తీశాడని అందరూ అంటున్నారు. కానీ నేనలా అనుకోవడంలేదు. రాముడే నన్ను నడిపించాడు. భగవంతుడి ఆశీస్సులతో మరో ఆరు నెలల్లో మళ్లీ మీ ముందుకొస్తాను. మళ్లీ నయనతార నటిస్తానంటే బాలయ్యతో మరో పౌరాణికం తీయడానికి సిద్ధం’’ అని చెప్పారు.
Source: Sakshi.com |
|
|
|
|
|
|
|
|
| |
|
|
| |
|
|
|
|